Kamareddy | అక్రమాలపై చర్యలు షురూ
ఉదయం కూల్చివేతలు
Kamareddy | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు (Actions) షురూ చేశారు. కామారెడ్డిలో ఎప్పటి నుంచో అక్రమ నిర్మాణాలపై సాధారణ ప్రజలు, ఆయా పార్టీల నాయకులు సైతం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో కామారెడ్డి మున్సిపల్ అధికారులు ఇవాళ ఉదయమే రంగంలోకి దిగారు. ఆయా ప్రదేశాల్లో కబ్జాలకు పాల్పడి నిర్మాణాలు చేసిన రేకుల షెడ్లు, ఇతర వాటిని కూల్చి వేశారు. కామారెడ్డిలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ వేకువ జామున కూల్చివేతలు చేపట్టడంతో చర్చనీయాంశంగా మారింది.
మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు సిద్దమయ్యారు. వీక్లీ మార్కెట్లోని (market) సర్వే నం.6లో నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో సర్వే నం.6లో స్థలాన్ని కొందరు కబ్జాదారులు ఆక్రమించుకుని అక్రమ కట్టడాలను నిర్మించారు. దాంతో కొద్దికాలంగా ఈ ప్రాంతంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.
కబ్జాల విషయంలో గతంలో కొందరు నాయకులు ప్రజల (People) తరుఫున ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. ఈ విషయమై బాధితులు, అధికారులు కోర్టుకు వెళ్లగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చింది. కోర్టు తీర్పు అమలులో జాప్యం కావడంతో మున్సిపల్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు సోమవారం మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం సదరు సర్వే నెంబర్లో అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చి పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు. రానున్న రోజుల్లో ఇదే స్థాయిలో కబ్జాలను గుర్తిస్తే కామారెడ్డి పట్టణానికి ఎంతో మంచి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


