Mylavaram | రేపు మైలవరంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్…

Mylavaram | రేపు మైలవరంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్…

  • రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి.
  • హాజరు కానున్న జిల్లా కలెక్టర్
  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం పట్టణంలోని ఎస్‌.వి. కళ్యాణమండపంలో రేపు (మంగళవారం) నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ సమావేశం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. సోమవారం జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో పింఛన్ల పంపిణీ అనంతరం మాట్లాడిన ఆయన, ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు హాజరవుతున్నారని చెప్పారు.

రెవెన్యూ సమస్యలు పెద్దఎత్తున పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు తరచూ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమస్యలను ఒక్కచోట పరిష్కరించేందుకు జిల్లా ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మైలవరంలో ప్రజాదర్బార్ కొనసాగనుందని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారుల దరఖాస్తులు, భూ సర్వే సమస్యలు, గ్రామ స్థాయి మరియు వ్యక్తిగత రెవెన్యూ సమస్యలును ఈ వేదికపై ఉంచి తక్షణ పరిష్కారం పొందాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైలవరం నియోజకవర్గ ప్రజలకు సూచించారు.

Leave a Reply