Promotions | జీవో ఇచ్చారు సరే..

Promotions | జీవో ఇచ్చారు సరే..

  • పదోన్నతులు ఏవీ
  • ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆగ్రహం

Promotions | అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో : ఆరేళ్లుగా ఆగిపోయిన పదోన్నతలు విషయంలో ఉద్యోగ సంఘాల కృషి మేరకు ఆర్టీసి వీసీ, యం.డీ చొరవతో ధీపావళి కానుకగా పదోన్నతలు ఇస్తున్నామని ముఖ్యమంత్రే ప్రకటిస్తూ జీఓ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇంకా చాలా జిల్లాలలో అన్నికేటగిరుల పదోన్నతలు అమలులో జాప్యం జరుగుతుందని ఈ జాప్యాన్ని నివారించి పదోన్నతలుపై వీసీ, యం.డీ, ఇడీ, డీపీటీఓలకు ఇచ్చిన ఆదేశాలమేరకు వెంటనే అందరికీ పదోన్నతలు ఇచ్చేలా చూడాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.వీ.నరసయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

పీటీడీ ఉద్యోగుల పదోన్నతలు పై ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఏడు ఉమ్మడీ జిల్లాలలోని 15 డివిజన్లలో న్యాయపరమైన అడ్డంకులు వచ్చాయని15 డివిజన్లలో పదోన్నతలు తాత్కలింగా నిలుపుదల చేయమని ఆదేశించినందున ఈసమస్యను అన్ని ఉద్యోగసంఘాలతో చర్చించి అర్హులైన ఉద్యోగులకు వెంటనే పదోన్నతలు ఇచ్చేలా చూడాలని జి.వి.నరసయ్య డిమాండు చేశారు. ఆదివారం వి.కె.భవనంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం జిల్లా కార్యదర్శి పి.యస్.ఖాన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆర్.విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి. నరసయ్య, జోనల్ అధ్యక్షులు కె.కె.కుమార్ పాల్గొన్నారు.

స్త్రీ-శక్తి పథకం విజయవంతం చేయటానికి ఆర్టీసీ ఉద్యోగులు తమ శక్తినంత కూడబెట్టి పనిచేయుచున్నారని తద్వారా ప్రభుత్వానికి మంచిపేరు వచ్చిందని ఈ పతకము మరింత విజయవంతం కావాలంటే ఇప్పుడు ఉన్న బస్సులు, సిబ్బంది సరిపోనందున మరో మూడు వేల కొత్త బస్సులు, పదివేలు సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య విజ్ఞప్తి చేశారు. జోనల్ అధ్యక్షులు కె.కె.కుమార్ మాట్లాడుతూ స్త్రీ-శక్తి పథకము అమలు తరువాత ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టుటకు, దాడి చేసినవారిని కఠినంగా శిక్షించుటకు యాజమాన్యం, ప్రభుత్వం తగినచర్యలు తీసుకోవాలని కోరారు.

రామకృష్ణకు ఘన సన్మానం..
అనంతపురం డిపోలో కండక్టర్ గా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కోశాధికారీగా పనిచేస్తున్న యస్.రామకృష్ణ పదవీ విరమణ సందర్బంగా ఈ సమావేశంలో ఘనంగా సన్మానించారు. సమావేశంలో జోనల్ నాయకులు కె.కొండయ్య,ఎన్ సి. శేఖర్, ఎంఆర్.ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ వి బి.రెడ్డి,పి ఎస్.ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు సి.గోపాల్, డి ఒ. రత్నం, .మల్లికార్జున, జిల్లా ట్రెజరర్ ఎస్.రామకృష్ణ, కె.కల్లప్ప,ఎ.లోకేష్ కుమార్, ఎస్ఎస్ఎస్ జిల్లా నాయకులు బి. ఆదినారాయణ,7డిపోల అధ్యక్ష కార్యదర్శులతో పాటుగా అధిక సంఖ్య లో ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply