Accident | కుక్క అడ్డు రావడంతో..

Accident | కుక్క అడ్డు రావడంతో..
Accident, కంకిపాడు, ఆంధ్రప్రభ : కంకిపాడు మండలం ఈడుపుగల్లు హైవే పై రామాలయం వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో వణుకూరుకు చెందిన కుమారవర్ధన్ (28) మృతి చెందాడు. కుమారవర్ధన్ బుల్లెట్ పై వస్తుండగా, కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన పై కంకిపాడు పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
