Operation Sindoor 2.0 | రౌండ్ 2 కి రెడీ….

Operation Sindoor 2.0 | రౌండ్ 2 కి రెడీ….
పాకిస్థాన్ లేదా ఉగ్రవాద సంస్థలు నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట కయ్యానికి కాలు దువ్వితే భారత్ మరింత బలంగా ప్రతీకారం తీర్చుకుంటుందని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సంచలన హెచ్చరిక జారీ చేసింది.
‘ఆపరేషన్ సిందూర్ 2.0’ కోసం తాము సిద్ధంగా ఉన్నామని, కేవలం ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం అని బీఎస్ఎఫ్ ఐజీ శశాంక్ ప్రకటించారు.
ఐజీ శశాంక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జమ్మూ ప్రాంతంలో భద్రతా వ్యవస్థ గతంలో కంటే మరింత మెరుగైందని తెలిపారు. అప్‌గ్రేడ్ చేసిన డ్రోన్లు, యూఏవీలు (UAVs), పటిష్టమైన నిఘా వ్యవస్థలతో జమ్మూ ఇప్పుడు మరింత సురక్షితంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఆపరేషన్ సిందూర్ అనేది ఉగ్రవాద నిరోధక చర్య మాత్రమేనని, ఇది పూర్తి స్థాయి యుద్ధం కాదని ఆయన వివరించారు.
‘Operation Sindoor‘ దెబ్బకు పాక్ విలవిల
గతంలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో బీఎస్ఎఫ్ బలం ఎంతటిదో పాకిస్థాన్‌కు తెలిసిందని ఐజీ శశాంక్ అన్నారు. ఆ ఆపరేషన్‌లో భాగంగా తాము 118 పాకిస్థానీ పోస్టులను, బహుళ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని వెల్లడించారు. భారత్ కొట్టిన ఆ దెబ్బ నుండి పాకిస్థాన్ ఇప్పటికీ కోలుకోలేదని ఆయన పేర్కొన్నారు. దీని ఫలితంగానే, పాకిస్థాన్ తమ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 72 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను బోర్డర్ నుంచి చాలా దూరంగా వెనక్కి తీసుకువెళ్లిందని ఆయన తెలిపారు.
