India vs Pakistan| స్టేడియంలో నారా లోకేష్ తో పాటు సినీ,రాజకీయ నాయకుల సందడి
దుబాయ్ వేదికగా నేడు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఇండియా వర్సెస్ పాక్ జట్ల మధ్య పోటీ కావడంతో ఉత్కంఠబరితంగా మ్యాచ్ సాగుతోంది. ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడడానికి పలువురు సినీ ,రాజకీయ సెలబ్రెటీలు స్టేడియానికి వెళ్లారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ , మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ స్టేడియంలోన కూర్చొని లైవ్‌లో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

చిరంజీవి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణి రెడ్డితోపాటు స్టేడియంలో ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఏపీ మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, ఫిల్మ్ డైరెక్టర్ సుకుమార్ తదితరులు కూడా టీమిండియా జెర్సీని ధరించి భారత జట్టును ఎంకరేజ్ చేస్తున్నారు.
