Bank | రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
Bank | దండేపల్లి, ఆంధ్రప్రభ : బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం గిరి మోజు నాయక్(RM Giri Moju Nayak) సూచించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు దండేపల్లి బ్రాంచ్లో ఈ రోజు ఖాతాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాంకు రుణాల గురించి అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాల(online fraudster) పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు పేరు(Bank Name)తో ఎవరైనా ఫోన్ చేసి వివరాల అడిగితే చెప్పొద్దు అన్నారు. ఏదైనా ఉంటే నేరుగా బ్యాంకుకు వచ్చి కనుక్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ భూమ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

