EVM | ఈవీఎం గోదాంను తనిఖీ…

EVM | ఈవీఎం గోదాంను తనిఖీ…
EVM | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం(EVM warehouse) కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilash Abhinav) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు.
పోలీసు సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. ఎల్లప్పుడు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

