Chiranjeevi | భార‌త్ – పాక్ మ్యాచ్ లో మెగాస్టార్ !

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు (ఆదివారం) భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాగా, దుబాయి వేదిక‌గా జ‌రుగ‌తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెల‌చిన పాక్.. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ ఉత్కంఠ పోరుకు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మెగాస్టార్ స్టాండ్లలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ఇక ఇప్పటివరకూ, 40 ఓవర్ల ఆట పూర్తి కాగా.. పాకిస్థాన్ జట్టు 5 వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. ఇక‌ ప్ర‌స్తుతం క్రీజులో అఘా సల్మాన్ (15) – ఖుష్దిల్ షా (9) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *