community service | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

community service | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

community service | సదాశివనగర్, ఆంధ్రప్రభ : నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం తపించే వంకాయల శిరీష రవి(Sirisha Ravi)ని స్థానిక ఎన్నికలలో సదాశివనగర్ గ్రామ సర్పంచ్ గా గెలిపించడానికి ఓటర్లు సన్నద్ధమవుతున్నారు. గత ఎన్నికలలో ఉపసర్పంచిగా ఎన్నికై ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలలో మమేకమై ప్రజా సేవకుడిగా పేరుగాంచిన వంకాయల రవి(మాజీ ఉప సర్పంచ్) సతీమణి వంకాయల శిరీష ఈ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది.

గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి, రాష్ట్రం(state)లోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వంకాయల శిరీష రవి సమాజ సేవ చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. సమాజ సేవ(community service)లో భాగంగా ప్రమాదాలకు గురైన వారికి సహాయం అందించడం, తప్పిపోయిన వారి ఆచూకీ కోసం, ద్విచక్ర వాహనాలు, మూగజీవాలు, ప్రజలకు అవసరమయ్యే సమాచారం సోషల్ మీడియా(social media) ద్వారా ప్రచారం చేయడంలో గుర్తింపు పొందారు.

సోషల్ మీడియా ద్వారా 33 జిల్లాల(33 districts)కు అనుసంధానంగా వారి అవసరాలను తీర్చడానికి సకాలంలో స్పందించడం వారి ప్రత్యేకత. సదాశివనగర్ గ్రామ సర్పంచ్ గా రవి భార్య శిరీషకు అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేసి చూపిస్తామని మాటిస్తున్నారు.

Leave a Reply