check post | ఎన్నికలు నిష్పాక్షపాతంగా నిర్వహించాలి

check post | ఎన్నికలు నిష్పాక్షపాతంగా నిర్వహించాలి
check post | రెంజల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సర్పంచు, పాలకవర్గం ఎన్నికలు నిష్పాక్షపాతంగా నిర్వహించాలని బోధన్ ఎసీపీ శ్రీనివాస్(ACP Srinivas) స్పష్టం చేశారు. ఈ రోజు మండలంలోని సాటాపూర్, నీలా గ్రామాలలో నామినేషన్ల(nominations) స్వీకరణ కేంద్రాలను పర్యవేక్షించారు.
ఎన్నికల నియామావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర పదార్థాలు రాకుండా చెక్ పోస్ట్(check post)ల వద్ద ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని సూచించారు. విజిబుల్ పోలిసింగ్, నాకబందీలు ఆకస్మిక తనిఖీల నిరంతరం జరగాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బ్లాక్ మార్చ్(black march) నిర్వహించాలని అన్నారు.
ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. శనివారం వారాంతపు సంత ఉండడం చేత నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా సంతను మార్పిడి చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.
