MLA| ఘనంగా పూలే 135వ వర్ధంతి..

MLA| పులివెందుల అర్బన్, ఆంధ్రప్రభ : జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి మున్సిపల్ వైసీపీ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ చైర్మన్లు చిన్నప్ప, రసూల్ పట్టణ ఉపాధ్యక్షుడు పార్లపల్లి కిషోర్, చంద్రమౌళి, వైకాపా నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే సామాజిక విప్లవకారుడు, కుల వివక్షత, అంటరానితనం పై పోరాటం చేసి వెనుకబడిన బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు అన్నారు. మహిళలకు విద్యా అవకాశం కల్పించి సమాజంలోని అసమానతల పైన ఉద్యమించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఖాదర్ భాష, రాము, దాసరి ఈశ్వరయ్య, శ్రీరాములు, సంపత్, రాయుడు, కనక, బాలుడు, కో ఆప్షన్ నెంబర్ దాసరి చంద్రమౌళి, ఫక్రుద్దీన్, తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply