Results – యుజీసీ నెట్ ఫలితాలు విడుదల

న్యూ ఢిల్లీ – యుజీసీ నెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌ (JRF), వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత కోసం ఏటా 2సార్లు యూజీసీ నెట్ అర్హత పరీక్షను నిర్వహిస్తుంది

మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతుండగా.. యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 ఫలితాలు ఆదివారం ఉదయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీయే తెలిపింది. యూజీసీ నెట్‌కు సంబంధించిన ‘కీ’ ఫిబ్రవరి 3న విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 6.49 లక్షల మంది హాజరవ్వగా.. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5,158 మంది, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్‌కు 48,161 మంది, పీహెచ్‌డీ కోసం 1,14,445 అర్హత సాధించారు .

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *