High Court | పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం..

High Court | పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం..
High Court | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై హైకోర్టు (High Court) లో దాఖలైన పిటిషన్లపై ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల పరిమితిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం, ఈ దశలో జీవోపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నిర్వహణ కోసం ప్రభుత్వం నవంబర్ 22న జీవో నెం.46ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50 శాతం కంటే ఎక్కువ కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ వారి పిటిషన్పై విచారణ చేపట్టిని చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కార్ విడుదల చేసిన జీవో నెం.46పై ఈ దశలో స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు.
