Jyotiba Phule |సామాజిక వివక్షతపై సమర శంఖం మహాత్మా ఫూలే
- సామాజిక విప్లవ పితామహుడికి ఘన వివాళి
Jyotiba Phule | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సామాజిక వివక్షకతపై సమర శంఖం ఊదిన మహాత్మా జ్యోతీబా ఫూలే అందరికీ అదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. సంగారెడ్డిలోని బాలాజీనగర్ (30వ వార్డు)లోని మహాత్మా జోతిబా పూలే పార్క్ లో ఆయన ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యాక్రమానికి విశ్రాంత ప్రిన్సిపాల్ మాదేవిని అనంతయ్య అధ్యక్షత వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, అడ్వకేట్ అనుముల నర్సింగరావు హాజరై మాట్లాడారు.
సామాజిక వివక్షకతపై వారి పోరాటాన్ని గుర్తు చేసి వారు సామాజిక విప్లవ పితామహుడని వారి బాటలోనే బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, భారత దేశ చరిత్రలో రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్, నారాయణ గురు లాంటి యోధులు ఉద్యమాలు నిర్వహించి సామాజిక మార్పు కోసం బాటలు వేశారని గుర్తు చేశారు. ఆ మహనీయుల స్ఫూర్తితో మనం స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అనుభవిస్తున్నామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జి.లక్ష్మయ్య, గజేందర్ రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రావణకుమార్, మెట్టు కృష్ణ, కవి సంజీవి, కాశీ విశ్వనాథ్, మున్నూరు ఆంజనేయులు, బిలాల్పూర్ నర్సిములు, కలబగూర్ మహేష్ వార్డు యువనాయకులు బిల్డర్ అనిల్, అఖిల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

