Collector | ఎన్నికల సంస్కరణలపై సమీక్ష…

Collector | ఎన్నికల సంస్కరణలపై సమీక్ష…
తిరుపతి ప్రతినిధి, ఆంధ్ర ప్రభ : ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ మ్యాపింగ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 సన్నాహక చర్యలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ (Vijayawada) సచివాలయంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి జరిగిన ఈ సమావేశంలో, తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, రోజ్ మాండ్, ఆర్డీవోలు రామ్మోహన్, భాను ప్రకాశ్ రెడ్డి, కిరణ్మయి తదితర అధికారులు హాజరయ్యారు.
రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు కలెక్టర్ (Collector) వివరణ ఇస్తూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 కార్యక్రమం కోసం ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఈడిటిలు, ఈఎస్ఏలకు అవసరమైన శిక్షణ ఇప్పటికే అందించామని తెలిపారు. ఓటర్ మ్యాపింగ్‌కు సంబంధించిన పనులు జిల్లాలో పూర్తయ్యాయని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బిఎల్ఓలను నియమించేందుకు ప్రతిపాదనలు వెంటనే పంపిస్తామని వెల్లడించారు. జిల్లాలో పనిచేస్తున్న బిఎల్ఓలకు ఐడికార్డులు పంపిణీ పూర్తి చేశామని, పెండింగ్‌లో ఉన్న వివిధ ఫారమ్‌ల పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
