Child marriages | బాల్య వివాహాలు అరికట్టాలి..

Child marriages | తుగ్గలి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ కృషి చేయాలని పగిడిరాయి జడ్పీహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రాజు కోరారు. గురువారం పగిడిరాయి జడ్పీ పాఠశాలలో చదువుతున్న బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై వైద్య ఆరోగ్యశాఖ వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ గోవిందరాజులు, సీహెచ్ఓ కుమార్ నాయక్ లు మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కాన్పు సమయంలో తల్లి బిడ్డలకు ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందని వారు తెలిపారు. అంతేకాక పుట్టపోయే బిడ్డలు కూడా అనారోగ్యంగా ఉంటారని తెలిపారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ గంగ సిద్దు, ఏఎన్ఎం రేఖ, కానిస్టేబుల్స్ నెల్లూరు, హరిబాబు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
