MLA | సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు
MLA | కడెం, నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తమ సత్తాను చాటాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్(MLA Vedama Bojju Patel) పిలుపునిచ్చారు. ఈ రోజు రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఎమ్మెల్యే సమక్షంలో కడెం మండలంలోని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కడెం మాజీ వైస్ ఎంపీపీ కట్ట శ్యాంసుందర్(MP Katta Shyamsundar), పాండవపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పిన్నం మల్లవ్వ, మల్లేష్, కొండుకూర్ గ్రామ మాజీ సర్పంచ్ జాడి లచ్చన్న, బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు, తుమ్మల శ్రీహరిలకు ఎమ్మెల్యే కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగేల భూషన్(Padigela Bhushan), కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సతీష్ రెడ్డి, కడెం మాజీ జడ్పీటీసీ తక్కల రాధ సత్యనారాయణ. కన్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఎల్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు టి.ప్రతాప్ యాదవ్, కె మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

