Hydra | ర్యాలీ..

Hydra | ర్యాలీ..

Hydra, హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైడ్రా పని తీరును ప్రశంసిస్తూ.. కూకట్ పల్లి (Kukatpally) నల్ల చెరువు వద్ద వాకర్స్ గురువారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఒకప్పుడు ఇటు వైపు రావాలంటేనే.. నరకం కనిపించేది. దుర్గంధంతో ఊపిరి ఆడేది కాదు. హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసిన తర్వాత ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది అంటూ అభినందించారు. చెరువు అభివృద్ధి, పునరుద్ధరణ అంటే ఏంటో హైడ్రా చూపించింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ తో పాటు పటిష్టమైన బండ్ నిర్మించారు. ఇది ఇప్పుడు మా ఆరోగ్యాన్ని పెంచుతోందని ప్రశంసించారు. ఓపెన్ జిమ్ లతో పాటు షటిల్ కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, కూర్చొని సేద దీరెలా ఏర్పాట్లు చేయమని కోరారు. చెరువు చుట్టూ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి, హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply