Karimabad | హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేయాలి

Karimabad | హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేయాలి
Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, ఉద్యోగస్తులకు నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఎస్‌జీపీఏటీ రాష్ట్ర అదనపు కార్యదర్శి వెలీషోజు రామమనోహర్(Velishoju Ramamanohar) డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం 26 నవంబర్ న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్(Pensioners Association) తెలంగాణ హనుమకొండ జిల్లా శాఖ నూతన మీటింగ్ హాలు కాసర్ల జనార్దన్ రెడ్డి(Kasarla Janardhan Reddy) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ప్రారంభించారు.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ పీటిక ప్రతిజ్ఞను పెన్షనర్స్ అందరూ సామూహికంగా రాజ్యాంగానికి లోబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. పురుషోత్తం, కె.సుధీర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సమ్మారెడ్డి గారు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎల్. ప్రకాష్ గారు,వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సాంబయ్య గారు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఖాజా మొయినుద్దీన్ ప్రసంగించారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీగా పెన్షనర్స్ హాజరయ్యారు.
