Narayanapet | ఎస్.ఈగా బాధ్యతల స్వీకరణ

Narayanapet | ఎస్.ఈగా బాధ్యతల స్వీకరణ
Narayanapet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట(Narayanapet) నూతన సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్.ఈ.)గా నవీన్ కుమార్(Naveen Kumar) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, 1104 యూనియన్ సర్కిల్(1104 Union Circle) డివిజన్ నాయకులు మొగులప్ప, శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు శాలువా, పూలమాలతో ఘన సన్మానం చేశారు.
డీఈగా ఇక్కడ పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకున్న నవీన్ కుమార్ జిల్లాలోని అన్ని విభాగాల సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి నారాయణపేటకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో డీఈ నర్సింహరావు(DE Narsimharao), డీఈటీ జితేందర్, ఏడి సుధారాణి, ఏడి చంద్రశేఖర్ (మహబూబ్నగర్), జడ్చర్ల నవీన్ కుమార్, ఏఈ మహేష్,వెంకట నారాయణ, ఏఈటీ వెంకట్రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలెమోని కృష్ణ, కతాల్ అహమ్మద్, మోనోద్దిన్, తిప్రాస్పల్లి కృష్ణ, అశోక్ గౌడ్లు నూతన ఎస్.ఈ. నవీన్ కుమార్కు శాలువా, పూలమాలతో సన్మానం చేశారు.
