Officers| ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Officers| కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ రూపకర్త డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ యం. మహేష్ కుమార్, కర్నూలు అదనపు ఎస్పీ జి. హుస్సేన్ పీరా, ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణ మోహన్ పూలమాల అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అంబేద్కర్ వంటి మహానుభావుల కృషి వల్లే మన దేశానికి ప్రత్యేకమైన, సమగ్రతను ప్రతిబింబించే రాజ్యాంగం లభించిందని పేర్కొన్నారు.

రాజ్యాంగం ఆమోదించబడి 76 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ సందర్భంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్­యాన్ని వివరించి, భారత రాజ్యాంగ పీఠికను అందరితో చదివించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, ఆర్‌ఐలు నారాయణ, జావేద్, పోతలరాజు, ఆర్‌ఎస్సైలు, ఎఆర్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply