PM Modi | ఏవియేషన్ హబ్‌గా భారత్

PM Modi | ఏవియేషన్ హబ్‌గా భారత్

PM Modi | హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : భారత్ ఏవియేషన్ హాబ్ గా ఎదుగుతోందని ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) అన్నారు. ప్రధాని మోడీ బుధ‌వారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరో పార్క్‌లో సాఫ్రాన్ ఏర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ హైదరాబాద్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… భారత ఏవియేషన్ రంగం గత కొన్నేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

ఇప్పటికే 1500కిపైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. భారత్‌లోనే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ (Aircraft engine) MRO సెంటర్ ఏర్పాటు దేశానికి భారీ ప్రయోజనం చేకూరుస్తుందని, సాఫ్రాన్ సంస్థకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. MSMEలను ప్రోత్సహించే విధానంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారత్‌లో సాఫ్రాన్ యొక్క అతిపెద్ద MRO యూనిట్‌గా ఈ ఫెసిలిటీ నిలుస్తుందని, వేలాది మందికి స్కిల్డ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

Leave a Reply