CM | దిశా నిర్దేశం..

CM | దిశా నిర్దేశం..

జుక్కల్ కామారెడ్డి, (ఆంద్రప్రభ) : కామారెడ్డి జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఏలే మల్లికార్జున్ , జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఎంతో నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఏలే మల్లికార్జున్ (Ale Mallikarjun) ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) మంత్రి శ్రీధర్ బాబు సయితం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ను అభినందించారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శ్రేణులను అందరిని కలుపుకొని పోవాలని,ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని,కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలపర్చేందుకు కృషి చేయాలని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా కార్యాచరణ తయారు చేసుకోవాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

Leave a Reply