Government | రైతును రాజుగా చేయటమే ప్రభుత్వం లక్ష్యం

Government | రైతును రాజుగా చేయటమే ప్రభుత్వం లక్ష్యం
దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి
Government | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు (Kolluri Venkateswara Rao) పేర్కొ న్నారు. వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని మంగళవారం అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెం గ్రామంలో ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను రైతులకు వివరించారు. అనంతరం ప్రచార కరపత్రాలను అన్నదాతలకు అందించారు. ఈ కార్యక్రమంలో దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏఓ శుభ హారిక,అశ్వారావుపాలెం నీటి సంఘాల అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు,గ్రామ మాజీ సర్పంచ్ కొండవీటి మధు పార్టీ నేతలు దాసినేని సాంబయ్య,రేపల్లె నాగబాబు,కొండవీటి రవి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
