Congress | మహిళల సంక్షేమం కోసం..

Congress | మహిళల సంక్షేమం కోసం..

కామారెడ్డి జిల్లాలో10.92 కోట్ల పంపిణీ..
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ..
Congress, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (shabbir ali) చెప్పారు. మంగళవారం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో 10 కోట్ల 92లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరా శక్తి చీరలను గ్రామ గ్రామానా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని చెప్పారు. మండల కేంద్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామన్నారు.

Leave a Reply