FISHERMAN | నైపుణ్యం పెంపొందించుకోవాలి

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
మాధన్నపేట చెరువులో చేపపిల్లల విడుదల
FISHERMAN| నర్సంపేట (ఆంధ్రప్రభ): మత్స్యకారులు చేపల పెంపకంలో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకొని, మధ్య దళారులను ఆశ్రయించకుండా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు.
నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట చెరువులో చేప పిల్లలను చేప పిల్లలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద తో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. చెరువులో 6 లక్షల 81 వేల చేప పిల్లలు విడుదల చేసినట్లు పాటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్‌లోని పెద్ద చెరువైన మాధన్నపేట మత్స్య సహకార సంఘంలోని ప్రతీ సభ్యుడు చేపల పెంపకం లో నైపుణ్యం పెంపొందించుకొని ప్రైవేట్ వ్యక్తులకు చేపల ఉత్పత్తిని అప్పగించకుండా వారే నిర్వహించాలని కోరారు.
మొత్తం 11 లక్షల 50 వేల విలువైన చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి , మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీపతి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి పాల్గొన్నారు.
