​Don’t Care Pawan Worning : రెడ్​ గోల్డ్​ స్మగ్లింగ్​​

​Don’t Care Pawan Worning : రెడ్​ గోల్డ్​ స్మగ్లింగ్​​

  • అబివృద్ది బురఖా
  • కళ్లప్పగించిన ఆఫీసర్లు
  • యథేశ్చగా దోపిడీ
  • డిప్యూటీ సీఓం ఆదేశాలు గాలికే..  

(  ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో)

పకృతి ప్రేమికుడు.. పర్యావరణ రక్షకుడు పవర్ స్టార్ (power star) .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Ap Dyputy CM) ను సైతం .. అక్రమ ఘనులు మభ్య పెడుతున్నారు. అభివృద్ధి తారక మంత్రంతో.. కొండల్ని పిప్పి చేస్తున్నారు. కోట్లకు కోట్లు కొల్లకొడుతున్నారు.   డిప్యూటీ సీఎం  మంచికి కట్టుబడితే.. వీళ్లు   కాల్చిన అవినీతి  మసిగుడ్డను ఆయనపై విసిరేస్తున్నారు. పకృతి సమతుల్యానికి తూట్లు పొడుస్తుంటే.. చూస్తూ ఊరుకోని ఉన ముఖ్యమంత్రి నీడలో..  కొండాసురులు ట్రిప్పుల కొద్దీ  పరుగులు తీస్తున్న తీరును పరిశీలిద్దాం. 

Red gold

అది ద్వారకా తిరుమల మండలం  వైఎస్ జగన్నాథ పురం (Ys Jannatha puram) . గత ఏడాది  నవంబర్ ఒకటవ  తేదీన   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  దర్శించుకున్నారు. ఇదే గ్రామం ఇలవేల్పుల కోసం  దీపం పథకాన్ని ప్రారంభించారు.  ఆ రోజునే ఎర్రకంకర క్వారీలను (Red Rock Quaries)  పవన్ కళ్యాణ్ గమనించారు.   పుణ్యక్షేత్రాల్లో  ప్రకృతి సమతుల్యాన్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని..  తగిన చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Red gold

ఐ ఎస్ జగన్నాధపురం ఎర్ర కంకర  తవ్వకాలపై ఒక ప్రత్యేక కమిటీని (Special committee)  ఏర్పాటు చేస్తానని, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే రీతిలో ప్రకృతి పరిరక్షణ కే  ప్రథమ ప్రాధాన్యం ఇనిస్తానంటూ హామీ ఇచ్చారు. ప్రత్యేక  కమిటీని  ఏర్పాటునకు ఆదేశాలు జారీ చేశారు. అమ్మయ్యా.. పవనన్న వచ్చాడు, కొండల్ని కాపాడుతున్నాడు, అని జగన్నాథపురం జనం ఉబ్చితబ్బిబ్చయ్యారు.  కానీ..  ఆ కమిటీ విచారణ జరిపిందా? ప్రభుత్వానికి  నివేదిక సమర్పించిందో లేదో.. జనానికి ఇప్పటికీ తెలీదు. కానీ,  కొయ్యలగూడెం మండలం రాజవరం (Rajavaram) పంచాయతీ పరిధిలోని గంగవరం (ganhavaram) లో కొండగుట్టలు ప్రస్తుతం ధ్వంపం అవుతున్నాయి.  కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కొండలను పిండి చేస్తున్నారు.  అనధికారికంగా (Un official)   గ్రావెల్ తరలించి.. కోట్లు దిగమింగుతున్నారనేది జనం ఆరోపణ.

Don’t Care Pawan Worning :   అభివృద్ధి బురఖా

ఖమ్మం..కొవ్యూరు మధ్య  గ్రీన్ ఫీల్డ్ హైవే (Green field High way) నిర్మాణంతో .. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లోని ప్రజలు ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా జరగాలని కోరుకొంటున్నారు. గంగవరంలో కొండ సమీపంలోని  రెవెన్యూ   భూములను రోడ్డు నిర్మాణానికి  ప్రభుత్వం కేటాయించింది. ఇదే అవకాశంతో   గ్రీన్ ఫీల్డ్ హైవే నీడలో  గ్రావెల్ గ్యాంగ్ ( gravel gang)  రంగంలోకి దిగింది. ఎర్రమట్టి మాఫియాతో చేతులు కలిపింది. ఈ  కొండను  భారీ యంత్రాలతో గ్రావెల్ తోడేస్తున్నారు.  యధేచ్ఛగా   నిర్భయంగా ట్రిప్పర్ల కొద్దీ గ్రావెల్ స్మగ్లింగ్ (Red Rock Smuggiling)  చేస్తున్నారు. అధికారుల కళ్లెదుటే ఈ బాగోతం జరుగుతోంది. 

Don’t Care Pawan Worning :  దోపిడీ నిత్చ కృత్యం

ప్రతి నిత్యం   40 నుంచి 50  ట్రిప్పర్లలో ఎర్ర కంకర ను ఐఎస్ రాఘవపురం నుంచి ఏ విధమైన టోల్ గేట్ లు  లేని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు తరలిస్తూ, కోట్లాది రూపాయలు గడిస్తున్నారు.  ప్రతిలారీలోని ఎర్ర కంకర (Red Gold)  ఖరీదు రూ. 8 వేల  నుంచి 10 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఏడాదిలో ఎనిమిది నెలల పాటు ఈ తవ్వకాలు, తరలింపు    యధేఛ్ఛ గా జరుగుతుంది.  మిగిలిన నాలుగు నెలల కాలం వర్షాలు తుఫాను కారణంగా తవ్వకాలను నిలిపివేస్తారు.

ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులైతే తవ్విన ‌ఎర్ర కంకర్ని నిలవచేసి ఇంకా ఎక్కువ రేట్లకు విక్రయించి  అదనపు సొమ్ము వసూలు చేసుకుంటున్నారు.  ఇన్ని జరుగుతున్న అధికారులు ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా లేవంటూ ప్రజలు బాహటంగానే చెబుతున్నారు. రోజుకు 50 ట్రిప్పులు చొప్పున ప్రతి ట్రిప్పుకు పదివేల రూపాయల వసూలు చేస్తే 5 లక్షల రూపాయలు ఆదాయం లాగా 8 నెలలకు (240) సుమారు రూ. 12 కోట్లు దోచేస్తున్నారని జనం లెక్కలు కడుతున్నారు.  తమ జేబులు నింపుకుంటున్నారు.

Don’t Care Pawan Worning : పవనన్న వార్నింగ్ .. గాలికి…

Red gold

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో   గ్రావెల్ తవ్వే అక్రమార్కులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేగాక   కఠిన చర్యలు తీసుకోవాలని (pawan kalyan worned)   అధికారులను సైతం ఆదేశించారు. అధికారులు మాత్రం పట్టించుకున్న Officials /dont cared) దాఖలాలు ఇప్పటికీ లేవు. అదే గ్రామానికి చెందిన , ఆ పరిసరాలపై పూర్తి అవగాహన కలిగిన  కొందరు ఇప్పటికీ ఆ కొండను, తన ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకున్నారు.  అ కొండను ఇష్టానుసారంగా తవ్వేసుకుంటున్నారు.  కొండ గుట్టలను మాయం చేస్తున్తున్నారు.  పర్యావరణానికి తూట్లు పొడుస్టున్నారు. ఇంత జరిగినా  అధికారు పెదవి విప్పటం లేదు. అందుకే అధికారుల పాత్రపైనా అనుమానాలు రగిలాయి.

Leave a Reply