HOSPITAL | అరకొర వసతుల తో ఆస్పత్రి …

HOSPITAL | అరకొర వసతుల తో ఆస్పత్రి …

  • 30 పడగల ఆసుపత్రిగా మార్చాలి
  • పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలి
  • ప్రతిపాదనలకే సరి… అమలు ఎప్పుడో మరి?

HOSPITAL | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ తో పాటు మండలంలోని 10 గ్రామాలకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే పెద్ద దిక్కు. మోత్కూర్, గుండాల, ఆత్మకూర్ (ఎం),అడ్డగూడూరు నాలుగు మండలాలకు అందుబాటులో ఉన్న ఈ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా (Hospital) మార్చుతామని, ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ 4 మండలాల పరిధిలో ప్రమాదాలు జరిగినా,మృతదేహాల పోస్టుమార్టం (Postmortem of the Bodies) నిమిత్తం సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని రామన్నపేట, భువనగిరి ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. రామన్నపేట కి వెళ్లాలంటే గుంతల మయంగా,అద్వాన్నంగా మారిన ఆ రోడ్డు లో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది.

మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం వందమందికి పైగా రోగులు (ఓపి), చికిత్స నిమిత్తం వస్తున్నారు. ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే సేవలందిస్తుండగా, మరొక వైద్యురాలు భువనగిరి అర్బన్ కి డిప్యూటేషన్ (Deputation) పై వెళ్ళింది. ఆసుపత్రిలో ఎం పి హెచ్ ఈ ఓ పోస్ట్ సైతం ఖాళీగా ఉంది. పాటిమట్ల సబ్ సెంటర్ లో ఎం ఎల్ హెచ్ పి లేరు. మోత్కూర్, దత్తప్పగూడెం, పొడిచేడు సబ్ సెంటర్ లలో 1 వ ఏ ఎన్ ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమావేశ హాల్ రేకులు ఊడి అధ్వాన్నంగా మారింది. నాలుగు మండలాల్లో లక్షకు పైగా జనాభా ఉంది. వీరి సౌకర్యార్థం మోత్కూర్ లో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో పాటు , ప్రజల సౌకర్యం కోసం పోస్టుమార్టం కేంద్రం సైతం ఏర్పాటు చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కి ప్రతిపాదనలు పంపారు. ఈ సౌకర్యాల పట్ల ఎమ్మెల్యే సామెల్ (MLA Samel) ప్రత్యేక చొరవ చూపి ఆస్పత్రి అప్గ్రేడ్ తో పాటు పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply