AP | ఇంటర్‌ హాల్‌టికెట్లు రిలీజ్ !

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి.

ఇటీవల ప్రాక్టికల్‌ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ ద్వారా అందించే సేవ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను విద్యార్థులు కాలేజీ లాగిన్‌లతో పాటు వాట్సప్‌ గవర్నెన్స్‌లో భాగమైన ‘మనమిత్ర’ ద్వారా పొందవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు 95523 00009 నంబర్‌ ద్వారా వాట్సప్‌లో హాల్‌టికెట్‌ పొందవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

కాగా, మార్చి 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సర పరీక్షలు… మార్చి 3 నుండి 20 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు పరీక్షలు నిర్వహించనుండ‌గా.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేవారు.

మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీకి సంబంధించిన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మార్చి 3 నుండి 15వరకూ జరగనున్నాయి. రాష్ట్రంలో 325 కేంద్రాల్లో ఈ పరీక్షలకు ఏర్పాటు చేయగా, మొత్తం 67వేల 952 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Leave a Reply