Breaking | సీఐ శంకరయ్య డిస్మిస్..

Breaking | సీఐ శంకరయ్య డిస్మిస్..

Breaking | వివేకానంద హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి ఇతడే….


Breaking | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వివేకానంద రెడ్డి హత్య కేసు (Vivekananda Reddy murder case) చుట్టూ మరోసారి వేడెక్కిన రాజకీయ వివాదం నడుమ, పులివెందుల మాజీ సీఐ జె. శంకరయ్య (CI J. Shankaraiah) కు ఉద్యోగ విరమణకు ముందు భారీ షాక్ తగిలింది.

కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు, కర్నూలు జిల్లా వీఆర్‌లో ఉన్న సీఐ శంకరయ్యను పోలీస్‌ శాఖ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.


ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించిన మేరకు డీఐజీ ఆదేశాల ప్రకారం, క్రమశిక్షణా చర్యల నిమిత్తం సీఐ జె. శంకరయ్య (CI J. Shankaraiah) ను సర్వీస్ నుంచి తొలగించడంపై నిర్ణయం తీసుకున్నారు.

Breaking

ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి అని పేర్కొన్నారు.ఈ చర్య, గత కొన్ని రోజులుగా వేడెక్కుతున్న వివేకా హత్య కేసు చర్చల మధ్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవలే శంకరయ్య సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు లీగల్ నోటీసులు పంపిన విషయం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ నోటీసుల్లో..అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలతో ప్రతిష్ట దెబ్బతిందని,రూ. 1.45 కోట్ల పరువు నష్టం పరిహారం చెల్లించాలని,బహిరంగ క్షమాపణ చెప్పాలని శంకరయ్య డిమాండ్ చేశారు. ఈ చర్యతో ఆయన పేరుమీద మళ్లీ రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తాయి.

వివేకా హత్య అనంతరం సాక్ష్యాల తుడిచివేత, వాంగ్మూలాల మార్పు, ప్రభుత్వ ఒత్తిళ్లు—ఇవన్నీ సీబీఐ చార్జిషీట్‌ (CBI chargesheet) లో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో శంకరయ్య పాత్రపై ఇప్పటికే అనేక అనుమానాలు లేవనెత్తబడ్డాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఐ శంకరయ్య చర్యల వెనుక హంతకుల ఒత్తిడి, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటూ, ఆరోపణలు వెలువడగా, పోలీస్‌ వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నందుకే అతనిపై డిస్మిస్ నిర్ణయం తీసుకోవడం సమంజసం” అని పలువురు నాయకులు స్పందించారు.

డిస్మిస్ ఉత్తర్వుల్లో శంకరయ్య ప్రవర్తన, డిపార్ట్‌మెంట్‌ నిబంధనల ఉల్లంఘనలు, క్రమశిక్షణకు భంగం కలిగించే అంశాలనే ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.వివేకా హత్య కేసుతో అనుబంధిత అన్ని వివాదాలు మరోసారి ఉధృతమైన సమయంలో, సీఐ జె. శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం పెద్ద పరిణామంగా మారింది.ఈ నిర్ణయం రాజకీయ రంగంపై, కేసు దర్యాప్తు దిశపై, తదుపరి చర్యలపై సుదీర్ఘ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. .

ఈ వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మంత్రి ఫ‌రూక్ కు వినతి పత్రం అందజేత‌..

Leave a Reply