FIRE | ప్రమాదాల నివారణ..

FIRE | ప్రమాదాల నివారణ..


FIRE | కల్వకుర్తి, ఆంధ్రప్రభ : కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి లో శుక్రవారం మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో అగ్నిమాపక కేంద్రం ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో, ఆపరేషన్ థియేటర్ లో, ఐసీయూ, వార్డులలో అగ్ని ప్రమాదాలు (Fire Hazards) లేదా విద్యుత్ షాక్ ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ప్రాక్టికల్ గా చూయించి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply