CONFERENCE| యునెస్కో కాన్ఫరెన్స్ కు ఎంపిక
CONFERENCE | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని 33వ డివిజన్ పెరుకవాడకు (To Perukawada) చెందిన రంగరాజు రోహిణి అంతర్జాతీయ యునెస్కో కాన్ఫరెన్స్ కి ఎంపికయ్యారు. రోహిణి ప్రస్తుతం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, సుభేదారి – హనుమకొండలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వెనుక బడిన వర్గానికి చెందిన రోహిణి, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన 4వ అంతర్జాతీయ యునెస్కో మోడల్ ఎథిక్స్ ఆఫ్ న్యూరో టెక్నాలజీ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు ఎంపిక కావడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ధర్మపురి రాజ గోవిందు, మండల పరిషరాములు అన్నారు.
శుక్రవారం వారు మాట్లాడుతూ, ఈ కాన్ఫరెన్స్ 2025 డిసెంబర్ 12 నుండి 15 వరకు హాంకాంగ్ యునెస్కో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల మధ్య జరిగే ఈ ఎంపికలో మన భారతదేశం నుంచి అందులో అండర్ రైల్వే గేట్ (Under Railway Gate) వరంగల్ ప్రాంతం నుండి రోహిణి ఎంపిక కావడం విశేషం. ఆమె ప్రతిభకు, కృషికి ఇది అంతర్జాతీయ వేదికపై వచ్చిన గొప్ప గౌరవం. ఈ సందర్భంగా ధర్మపురి రాజాగోవిందు యునెస్కో తెలంగాణ స్టేట్ చాప్టర్ కోఆర్డినేటర్, మండల పరశురాములు భారత ప్రభుత్వ నేషనల్ యూత్ అవార్డ్ గ్రహీత, రోహిణికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. రోహిణిహాంకాంగ్ వెళ్లడానికి అవసరమైన విమాన ప్రయాణ వ్యయాలు భరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు..
వెనుకబడిన వర్గానికి చెందిన రోహిణి కుటుంబ స్థితి దృష్ట్యా, ఆమెకు ఎయిర్ టికెట్ ఖర్చులు భరించే సామర్థ్యం లేకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఆమెకు తక్షణ సహాయాన్ని అందించి, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రం నుంచి ఒక యువతి అంతర్జాతీయ ప్రతినిధిగా చేరే ఈ సందర్భంలో ప్రభుత్వం చేసే సహాయం ఆమె భవిష్యత్తుకు, రాష్ట్ర గౌరవానికి ఎంతో మేలు చేస్తుందని ధర్మపురి రాజ గోవిందు అన్నారు.

