CHECKDAM | రైతు సంక్షేమ‌మే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

CHECKDAM | కొడకండ్ల, ఆంధ్రప్రభ : కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగుపై రూ. 9 కోట్లు 35 లక్షల వ్యయంతో నిర్మించబోయే రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులకు పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సాగునీటి అవసరాల తీర్చడంలో చెక్‌డ్యామ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. బయన్న వాగుపై నిర్మించబోయే ఈ రెండు చెక్‌డ్యామ్‌లు నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి, పరిసర గ్రామాల గ్రౌండ్‌వాటర్ స్థాయిలను మెరుగుపరచనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ప్రాంతంలో శాశ్వత నీటి వనరులు అందుబాటులోకి వచ్చి, వ్యవసాయ రంగం మరింతగా పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు, కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల ఆండాలు శ్రీరామ్, బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మండల అధ్యక్షులు సురేష్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయి కృష్ణ,ప్రసాద్ రెడ్డి, వెంగళరావు, వనం మోహన్, పసునూరి మధుసూదన్, మసురం రవీందర్,అంద య్యాకయ్య, సునీల్ రెడ్డి, బత్తుల వెంకన్న,ధర్మారపు బిక్షపతి,యాకేష్ యాదవ్,గఫూర్, పల్లె అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply