STUDENTS| హెడ్మాస్టర్, ఎంఈఓకు షోకాజ్ నోటీసులు జారీ

STUDENTS| హెడ్మాస్టర్, ఎంఈఓకు షోకాజ్ నోటీసులు జారీ

  • పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

STUDENTS| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు గత మూడు రోజుల నుంచి గుడ్లు ఇవ్వలేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పాఠశాల అపరిశుభ్రంగా ఉంది. పనితీరు ఇదేనా అంటూ హెడ్మాస్టర్ పై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన శుక్రవారం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్ లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ ను జిల్లా కలెక్టర్ మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాల పరిసర ప్రాంతాలను కలియ తిరిగారు. అక్కడి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, విద్యార్థినులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నప్పటికీ విద్యార్థుల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని దీంతో విద్యార్థులు బహుర్బూభూమికి బయటికి వెళ్తున్నామని విద్యార్థులు తెలిపారు.

విద్యార్థులకు గత మూడు రోజుల నుంచి గుడ్లు ఇవ్వలేదుని చెప్పారు. జిల్లా పరిషత్ హైస్కూల్ తరగతి గదులు, హైస్కూల్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్వయంగా కలియతిరిగి అక్కడి సమస్యలు గుర్తించారు. విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి వారికి చదువు చెప్పారు. విద్యార్థులతో పలు ప్రశ్నలు రాబట్టారు వాటికి సమాధానాలు ఇచ్చారు. పాఠశాల పరిసర ప్రాంతాలు చాలా అపరిశుభ్రంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ వెంటనే పాఠశాల హెడ్మాస్టర్ కు, ఎంఈఓ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. పాఠశాలలో దేవాలయాల్లో ఉండాలని చదువు బాగా చదువుకునే విద్యార్థులకు మంచి మార్కులు పాస్ అయ్యేవిధంగా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.

Leave a Reply