GRAIN| సదాశివనగర్, ఆంధ్రప్రభ: రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ధాన్యానికి భద్రత లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ధాన్యం విక్రయించే సమయంలో మోసాలకు గురవుతున్నామని అంటున్నారు. మండలంలోని మర్కల్ గ్రామ శివారులో ఆరబెట్టిన వరి ధాన్యం గురువారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామానికి చెందిన రైతు ఏనుగు లింగారెడ్డి తెలిపారు. విక్రయించడానికి ఆరబెట్టిన ధాన్యం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు నాలుగు క్వింటాళ్లు చోరీ చేసినట్లు తెలిపారు.
GRAIN| వరి ధాన్యం చోరీ..

