SHUBAMAN GILL | రెండో టెస్టు నుంచి కెప్టెన్ ఔట్‌

  • మెడ నొప్పితో బాధ‌ప‌డుతున్న గిల్‌
  • చికిత్స కోసం ముంబై ప‌య‌నం

SHUBAMAN GILL |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : కోల్​కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండో రోజు బ్యాటింగ్​ చేస్తుండగా గిల్ గాయపడ్డాడు. మెడ నొప్పి గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ శుభ్​మన్ గిల్, సౌతాఫ్రికాతో రెండు టెస్టుకు దూరమయ్యాడు. గిల్​ ఇంకా రికవరీ కాలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. దీంతో గిల్ గైర్హాజరీలో రెండో టెస్టుకు రిషభ్ పంత్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ నవంబర్ 22న ప్రారంభం కానుంది.

SUBAMAN GILL | 3 బంతులు ఆడి 4 పరుగులు

SUBAMAN GILL

సైమన్‌ హార్మర్‌ వేసిన 35వ ఓవర్‌లో గిల్ స్వీప్‌ షాట్‌ ఆడాడు. ఈ షాట్ ఆడే క్రమంలో అతడి మెడ కండరాలు పట్టేశాయి. దీంతో గిల్ నొప్పితో విలవిల్లాడాడు. అనంతరం ఫిజియోలు వచ్చి అతడిని తీసుకెళ్లారు. అప్పటికి గిల్ 3 బంతులు ఆడి 4 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్​లోనూ గిల్ బ్యాటింగ్​కు రాలేదు. ​ ప్రస్తుతం అతడు మెరుగైన చికిత్స నిమిత్తం ముంబయికి పయన‌మయ్యాడు.

Leave a Reply