TIRUPATI |తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో(In Brahmotsavams) భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం చిరుజల్లుల మధ్య, ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారు మోహినీ అలంకారంలో పల్లకీలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వసంతోత్సవం నిర్వహిస్తారు.

గజ వాహనం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుండి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు (Mother Sri Padmavati) విశేషమైన గజ వాహనం పై భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహన సేవలో జేఈవో వి. వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


