FUND | సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
FUND | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని కాచ్ వార్ గ్రామానికి చెందిన జుట్ల సుజాత కు రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు మాజీ ఉప సర్పంచ్ వాకిటి శేషగిరి, మార్కెట్ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్ బాదిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైన కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ (CMRF) కొండంత అండగా నిలుస్తుందన్నారు.
మంత్రి శ్రీహరి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మక్తల్ నియోజకవర్గం ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం (Financial Assistance) అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాచ్ వార్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్ గౌడ్, నాయకులు గణేష్, ఓబులేష్, రాజు, నాగరాజు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

