LOC | ఎల్ఓసి అందజేత..
LOC | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని పారేవుల గ్రామానికి చెందిన చాకలి సుమిత్రమ్మ అనారోగ్యoతో బాధపడుతున్న కారణంగా వైద్య సేవల కోసం రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Sports Minister Dr. Vakiti Srihari) రూ.5లక్షల ఎల్ఓసి కాపీ అందజేశారు. ప్రజల ప్రాణాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మరోసారి పెద్ద మనసు చేసుకుని రూ.5 లక్షలు ఎల్ఓసి అందజేయడం పట్ల పారేవుల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

