CHAIRMEN| క్రీడాకారులకు ప్రోత్సాహకాలు..

CHAIRMEN| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులు అందరికీ ప్రోత్సాహకాలు తప్పనిసరిగా అందిస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ లోని ఢాకా నగరంలో జరిగిన ఏషియన్ ఆర్చరీఛాంపియన్‌షిప్ –2025 లో రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో బొమ్మదేవర ధీరజ్ స్వర్ణ పతకం కైవసం చేసుకోవడం పాటు చరిత్ర సృష్టించాడు. అలాగే, కౌలాలంపూర్, మలేషియాలో నవంబర్ 8 నుంచి 16 వరకు జరిగిన కామన్వెల్త్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ లలిత్ బాబు కాంస్య పతకం సాధించాడు.

ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మన రాష్ట్ర క్రీడాకారులైన రోహిత్ లలిత్ బాబు, ధీరజ్ లు అంతర్జాతీయ వేదికపై సాధించిన విజయాలకు గాను గురువారం విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో సత్కరించి, నూతన క్రీడా విధానం ప్రకారం వారికి రావలసిన క్రీడా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలియజేశారు. అలాగే వారిరువురి భవిష్యత్తుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అండగా ఉంటుందని తెలియజేశారు.

Leave a Reply