Narsampet | ఆంక్షలు లేకుండా చీరలు పంపిణీ చేయాలి

Narsampet | ఆంక్షలు లేకుండా చీరలు పంపిణీ చేయాలి

బీఆర్ఎస్ నర్సంపేట రూరల్ మండల కమిటీ డిమాండ్


Narsampet | నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట (Narsampet) బీఆర్ఎస్ రూరల్ మండల కమిటీ గురువారం ఉదయం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మండల ఇన్చార్జి నామాల సత్యనారాయణ, మండల కన్వీనర్ కొమళ్ళ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు (Kalvakuntla Chandrasekhara Rao) తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా 18 సం.లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇచ్చారని తెలిపారు.

ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మహిళ సంఘాలలో ఉన్న సభ్యులకు మాత్రమే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నేపథ్యంలో తెలంగాణలో చాలా మంది మహిళలకు చీరలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఎలాంటి అంక్షలు లేకుండా అర్హులైన ప్రతీ ఒక్క మహిళకు చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ (Telangana) మహిళలు ఏదో చేస్తారని ఆశించిన వారికి నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఉందనీ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు ఈర్ల నర్సింహరములు, మోతే పద్మనాభ రెడ్డి, బండారి రమేష్, మోటురీ రవి, కోడారీ రవి, భూక్య వీరన్న, అల్లి రవి, పెద్ది శ్రీనివాస్ రెడ్డి, జాటోతు బిమ్ల నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply