- మాజీ ముఖ్యమంత్రికి విజయవాడ ఎంపీ చురకలు
- బందరు చరిత్రలోనే ఘోరంగా ఓడిపోయిన పేర్ని నాని
- తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ
TDP | కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అదేవిధంగా క్రమశిక్షణతో కొనసాగుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గురువారం పులిగడ్డలోని మామిడితోటల్లో జరిగిన కార్తీక వనసమారాధనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మన నాయకులు చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాట్నాకు వెళ్లారని, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే మాత్రం కోర్టుకు ఊరేగింపుగా వెళ్లారని ఎద్దేవా చేశారు. కోర్టుకు వెళ్లాలంటే ఊరేగింపులెందుకని, మనకైతే సమస్య పరిష్కారానికి, విజయోత్సవాలకు ఊరేగింపులు అవసరమని తెలిపారు. కోర్టుకు వెళ్లేందుకు జనాన్ని పలు ప్రాంతాల నుంచి పోగు చేసుకురావటం విడ్డూరంగా ఉందని తెలిపారు. కానీ తప్పకుండా కోర్టులో జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడక తప్పదన్నారు.
మన నాయకుడు మనకిచ్చి క్రమశిక్షణ వల్లే వారికి వలే కాకుండా వేషాలు వేయకుండా పాలన సాగిస్తున్నామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉందని, ఇంచార్జ్ లేకపోయినా, ఎమ్మెల్యే లేకపోయినా కలసి కట్టుగా వనసమారాధన నిర్వహించటం అభినందనీయమన్నారు. మాజీ మం త్రి పేర్ని నానికి ప్రజలు ఓటు హక్కుతో బుద్దిచెప్పారని తెలిపారు, కొల్లు రవీంద్రను 52 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించుకున్నారంటేనే ప్రజలు ఏ విధంగా తమని తిరస్కరించారో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ సభ్యులంటే నా కుటుంబసభ్యులని, వారి కోసం ఎక్కడి వరకైనా వస్తానని పారు. అందరు సమిష్టిగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవటం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రులు కొలుసు పార్ధసారది. కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

