MINISTER| టీడీపీకి కంచుకోట అవనిగడ్డ నియోజకవర్గం
- రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
MINISTER| కృష్ణా జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : టీడీపీకి అవనిగడ్డ నియోజకవర్గం కంచు కోట లాంటిదని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం అవనిగడ్డ నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పులిగడ్డ మామిడి తోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్రమంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. టీడీపీ తరఫున ఉద్దండులు గెలుపొందారని గుర్తు చేసుకున్నారు. పార్టీ క్యాడర్ ఈ నియోజకవర్గంలో పటిష్టంగా ఉందని తెలిపారు. కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తగినట్లుగా పార్టీ శ్రేణులు పని చేస్తారని తెలిపారు. పార్టీ అధికారంలో లేని సమయంలో సైతం పార్టీని వెన్నంటి ఉన్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
గతంలో టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన సింహాద్రి సత్యనారాయణరావు, అంబటి బ్రాహ్మణయ్య అఖండ మెజార్టీతో గెలుపొందారని తెలిపారు. బుధవారం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.300 కోట్లు రైతులకు ఖాతా జమ జరిగిందని, స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. టీడీపీ శ్రేణులు అందరూ కలసి కార్తీక వనసమారాధన నిర్వహిస్తున్న సందర్బంగా అందరికీ అభినందనలు. తెలిపారు. దేశంలోనే టీడీపీ బలమైన శక్తిగా ఎదిగిందని తెలిపారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు భారీగా సక్సెస్ అయిందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడిందని తెలిపారు.

