Mothkur | చేనేత మహాధర్నాకు తరలివెళ్లిన కార్మికులు

Mothkur | చేనేత మహాధర్నాకు తరలివెళ్లిన కార్మికులు

Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (central and state governments) చేనేత రంగాన్ని విస్మరిస్తున్నారని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరుతూ నేడు హైదరాబాద్ లోని చేనేత కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టనున్న మహా ధర్నాలో పాల్గొనడానికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ కి చెందిన చేనేత కార్మికులు (Handloom workers)

గురువారం తరలివెళ్లారు.

Mothkur | తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ..

తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం (Telangana State Handloom Workers Association) ఉపాధ్యక్షులు కూరపాటి రాములు మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ విమర్శించారు. ఎంతో నైపుణ్యంతో, ప్రతిభతో ప్రపంచస్థాయి ప్రశంసలు అందుకున్న చేనేత కార్మికులు (Handloom workers).. పాలకుల వైఫల్యాల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార వ్యవస్థ కుప్పకూలిపోవడం, నేసిన బట్టలు అమ్మకాలు లేకుండా పోవడం, నిరంతరం పనిచేసినా పూట గడవక అప్పుల పాలై కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.

Mothkur |ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి..

చేనేత పరిశ్రమ (Handloom Industry) పూర్తిగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోత్కూర్ చేనేత కార్మికులకు పనికల్పించే విధంగా సహకార సంఘాలను పునరుద్ధరించడంతో పాటు వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా అమలు చేయాలని, నేతన్న బీమా, త్రిప్ట్ పథకాల చెల్లింపులు జాప్యం లేకుండా ఉండాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యలకు ప్రభుత్వం స్పందించేలా కమిషనర్ కార్యాలయం ముట్టడిలో పాల్గొని నిరసనను బలపరచాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

Leave a Reply