kashi | రుద్రాభిషేకం..

kashi | రుద్రాభిషేకం..
kashi, సూర్యాపేట, ఆంధ్రప్రభ: మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో గురువారం కార్తీకమాసం ముగింపు ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా ముగిశాయి. ఎరకేశ్వర, నామేశ్వర స్వామి దేవాలయాల్లో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాలకి 108 కలశాలతో శత కలశార్చన పూజ చేసి, కాశీ (Kashi) నుండి తెచ్చిన గంగాజలంతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం రంగు రంగుల పూలతో స్వామి వారిని అందంగా అలంకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
