Sheikh Hasina | కోసం ఇంటర్ పోల్ కు బంగ్లాదేశ్..

Sheikh Hasina | కోసం ఇంటర్ పోల్ కు బంగ్లాదేశ్..

Sheikh Hasina, న్యూఢిల్లీ : భారత్ నుంచి షేక్ హసీనాను రప్పించడానికి ఇంటర్పోల్ను బంగ్లాదేశ్ (Bangladesh) ఆశ్రయించనుంది. ఆగస్టు, 2024 లో విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమంతో పాటు దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా దేశం విడిచి భారత్లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆమె న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ రక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హసీనాకు, మాజీ హోం మంత్రి అసదుజ్ఞమాన్ ఖాన్ కమాల్కు బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేర ట్రిబ్యూనల్ (ఐసీటీ) నవంబర్ 17న మరణశిక్ష విధించింది. జులై-ఆగస్టు, 2024లో ఆందోళనల సమయంలో జరిగిన హత్యలకు ప్రేరేపణ, ఆదేశాలు జారీ చేయడం, నేరాలను అరికట్టకపోవడం వంటి మానవతావిరుద్ధ నేరాలకు ఈ శిక్ష విధించారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భార్ ను మరోసారి అధికారికంగా కోరింది.

2013నాటి ఇండియా-బంగ్లాదేశ్ (India – Bangladesh) అప్పగింత ఒప్పందం ప్రకారం హత్య, మానవతావిరుద్ధ నేరాలకు సంబంధించి నేరస్థులను అప్పగించడం తప్పనిసరి అని ఢాకా వాదిస్తోంది. భారత్ నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన స్పందన కాకపోవడంతో బంగ్లాదేశ్ ఇప్పుడు ఇంటర్ పోల్ను ఆశ్రయించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హసీనా పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ఒక దరఖాస్తును ఐసీటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం సిద్ధం చేస్తోంది. రెడ్ కార్నర్ నోటీసు జారీ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ఆమెను అరెస్టు చేసి బంగ్లాదేశ్ కు అప్పగించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటున్న భారత్ మాత్రం ఒప్పందంలోని రాజకీయ నేరం మినహాయింపు నిబంధనను ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐసీటీ తీర్పును ఏకపక్షం, రాజకీయ ప్రేరేపితం అని హసీనా కుమారుడు సజీబ్ వాజేద్, ఆమె అనుచరులు విమర్శించారు.

మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి
https://epaper.prabhanews.com

Leave a Reply