MBNR | ఉమామహేశ్వర దేవస్థానానికి భక్తుల విలువైన విరాళం

MBNR | ఉమామహేశ్వర దేవస్థానానికి భక్తుల విలువైన విరాళం
అచ్చంపేట, నాగర్‌కర్నూలు జిల్లా : అచ్చంపేట మండలం రంగాపురం గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కి చెందిన భక్తులు శ్రీరామదాసు శివశంకర్ కుటుంబ సభ్యులతో కలిసి పలు పూజా సామగ్రిని బుధవారం ఆలయానికి సమర్పించారు.
భక్తులు అందించిన పూజా వస్తువుల్లో వెండి ప్లేటు, దీపం సహా మొత్తం రూ.25,000 విలువ గల సామగ్రి ఉన్నట్టు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు.
భక్తి భావంతో సమర్పించిన ఈ పూజా సామగ్రిని ఆలయ కమిటీ సభ్యులు స్వీకరించి, విరాళదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేవస్థాన పూజలు, కార్యక్రమాల నిర్వహణకు ఈ విరాళాలు ఎంతో ఉపయోగపడతాయని కమిటీ పేర్కొంది.
