21 Test | 21న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్

21 Test | 21న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్

21 Test | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : ఈ నెల 21న మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్(Flint Science Talent Test) నిర్వహించనున్నట్లు మండలం శాఖ అధ్యక్షుడు యాకన్న, ప్రధాన కార్యదర్శి అనిల్ తెలిపారు.

ఈ సందర్బంగా ఈ రోజు వారు మాట్లాడుతూ మండల పరిధిలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల(Government, Private School) విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమాన్ని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. మండలంలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యజమాన్యాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply