Congress | ఇందిరమ్మ సేవలు ఆదర్శం….

Congress | బిక్కనూర్, ఆంధ్రప్రభ : స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి(Chandrakant Reddy) అన్నారు. ఈ రోజు మండల కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి గ్రామంలో ఆమె జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందిరాగాంధీ(Indira Gandhi) విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల(Badugu from the weaker sections) సంక్షేమం కోసం ఇందిరా గాంధీ ఎన్నో పథకాలను అమలు చేశారని తెలిపారు. అట్టి పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు.

పేద ప్రజల గుండెల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ(Congress party) అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు భూమయ్య, సిద్ధిరామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు లింబాద్రి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply